మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని కాచికల్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకుడు గణపురం సోమయ్య మృతి చెందడం జిల్లాకే తీరని లోటని మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. శనివారం ఆయన మృతదేహానికి పూలమాలవేసి పార్టీ కండువా కప్పి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చదిన గణపురం సోమయ్య వెనకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అని అన్నారు. ఆయన పేదలను ఆదుకునేందుకు ఎంతటి వారి తోటి నేను చర్చించి వారి సమస్య పరిష్కార మార్గంగా ముందుకు సాగిన వ్యక్తి అని అన్నారు అలాంటి గొప్ప వ్యక్తి మరణించడం ఎంతో బాధాకరమని తెలిపారు. మృతి చెందిన కుటుంబానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్టు చెప్పారు. మృతి చెందిన కుటుంబానికి ప్రత్యేక అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి ,పరిపాటి వెంకట రెడ్డి , బత్తిని అనిల్ ,దికొండ వెంకన్న, సారంపల్లి వెంకట్ రెడ్డి ,సంకినేని కిరణ్ రావు, శ్రీను నాయక్ ,ప్రకాష్ ,వంగల ఈశ్వర్ , జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ సోమన్న మృతి బాధాకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



