భయపెడుతూనే ఉంది, భయపడుతూనే జీవిస్తున్నా
చిన్నప్పుడు ఒకలా, యవ్వనంలో మరోలా,
వృద్ధాప్యంలో ప్రతి క్షణం…
చివరకు క్షణక్షణం భయపెడుతూనే ఉంది,
నేను భయపడుతూనే ఉన్నా.
పక్కింటి పార్వతమ్మ—
“పర్వాలేదులే వయసైపోయింది”
ఎదురింటి చంద్రయ్య తాత నొప్పితో…
విషజ్వరాలతో చిన్న పిల్లలను
కాటికి పంపిస్తూ భయపెడుతూనే ఉంది,
నేను భయపడుతూనే ఉన్నా.
చిన్నప్పుడు తెలియదు,
కొందరు నేతలు పోతే బడికి సెలవు…
అదో ఆనందం! ఇంకొందరు పోవాలని…
చుట్టాలు పోతే గుండెలో బాధ,
మృత్యు శకటం లాగా దాని ప్రయాణం ఆగదు…
ఎవరో ఒకరిని తీసుకుపోతూ
భయపెడుతూనే ఉంది,
నేను భయపడుతూనే ఉన్నా.
అది ఎప్పుడూ నన్ను మృత్యు కంటకం లాగా,
జీవితంలో విషాద నీడలతో
భయపెడుతూనే ఉంది,
నేను భయపడుతూనే ఉన్నా.
ఓ మృత్యు కంటకమా! నిన్ను ధైర్యంతో జయిస్తే
నేను భయపెడుతూనే ఉంటాను,
ఆనందంగా నవ్వుతూ జీవిస్తూనే ఉంటా!
నర్సింహ వెల్మజాల, 9867839147
మృత్యు కంటకం!
- Advertisement -
- Advertisement -



