- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి : మండల పరిధిలోని గుగ్గీళ్ల గ్రామ శివారులోని ఇథనాళ్ పరిశ్రమ వ్యర్థాలు సాగు కాల్వలో కలిసిన తీరును ఆదివారం మండల అఖిలపక్షం నాయకులు సందర్శించి పరిశీలించారు.ఇథనాళ్ పరిశ్రమల వ్యర్థాల వల్ల సంభవించిన అనర్థాలపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించాలని అఖిలపక్షం అధ్వర్యంలో డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం), సీపీఐ, డీఎస్పీ, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు సందర్శనలో పాల్గొన్నారు.
- Advertisement -



