నవతెలంగాణ-ఆర్మూర్
మున్సిపల్ కార్యాలయంలో చేయూత పెన్షన్ పథకానికి అర్హులైన లబ్ధిదారులు నేటి సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవాలని చైర్ పర్సన్ గోనె లహరి రఘు ఆదివారం కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యంగా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులు, పైలేరియా, డయాలసిస్, గీతా కార్మికుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సారధ్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఆమె కోరారు. చేయూత పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రేపు చివరి తేదీ కావున కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఆమె ఆకాంక్షించారు.
అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



