నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గంలో శనివారం పలు కార్యక్రమాల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. దమ్మపేట మండలం కొడిసెలగూడెం లో అనారోగ్యంతో మృతిచెందిన ధారబోయిన అప్పారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
అనంతరం దమ్మపేట మండల కేంద్రంలోని వినాయక ఫంక్షన్‌హాల్‌లో మొద్దులగూడెం గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు రావు రఘు–పావని దంపతుల కుమార్తె హస్యుత నిశ్చయ తాంబూలాల వేడుకకు ఎమ్మెల్యే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కక్కిరాల రమేష్, సర్పంచ్ పగడాల రమాదేవి–రాంబాబు, రావు గంగాధర్‌రావు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నశెట్టి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో బాలా శంకర్ ఫైర్ వర్క్స్, వై నాట్ సూపర్‌మార్కెట్ ప్రారంభోత్సవాలు తలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని దుకాణాలను ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్‌పర్సన్ తదితరులు పాల్గొన్నారు.



