Sunday, August 30, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం: ఎమ్మెల్యే

పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం
జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం లింగారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స అవసరమైన పరిస్థితిలో ఉన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్సకు సుమారు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన లింగారెడ్డి పరిస్థితిని తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, చికిత్సకు అవసరమైన రూ.4 లక్షల మొత్తానికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. పేదల వైద్య అవసరాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న ఎమ్మెల్యే చొరవపై లింగారెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -