నవతెలంగాణ – తొగుట
మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన క్యాస ధనలక్ష్మి – శివకోటి దంపతుల కుమార్తె నంది ని, క్యాస వెంకటలక్ష్మి – కృష్ణమూర్తి దంపతుల కుమారుడు మల్లికార్జున్‌ల వివాహ వేడుక ప్రజ్ఞా పూర్‌లోని బింగి ఎల్లయ్య గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీని వాస్ రెడ్డి హాజరై నూతన వధూవరులు ఆశీర్వదిం చారు. ఈ సందర్భంగా నూతన దంపతులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. వధూవరుల కుటుం బ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్య క్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పంది రాజు, నాయ కులు పబ్బతి మల్లారెడ్డి, శ్రీనాకర్ రెడ్డి, ఉల్లెంగుల సాయి, బండా రు రమేష్ గౌడ్, వెంకటేశం, జంగ పల్లి ఆంజనేయు లు, వడ్డె కిష్టయ్య, నిరంజన్ రెడ్డి, జిడిపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



