నవతెలంగాణ-ఆలేరు టౌను
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ అన్నారు. ఆలేరు పట్టణంలో ఆదివారం సిపిఐ పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చెక్క వెంకటేష్ మాట్లాడుతూ.. ఆలేరు పట్టణం, మండలంలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. భూ అక్రమ పోరాటాలు కొనసాగుతున్నాయని, ఇప్పటికీ దరఖాస్తు చేసుకున్న పేదలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదర వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్, ఎమ్మార్వో, ఆర్డిఓ, ఎమ్మెల్యే స్పందించి, పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇద్దరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చౌడబోయిన పరశురాములు, కందుల మధు, సామి, రాజు, జి.సామి తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



