Sunday, August 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో మాజీ డీసీసీ అధికార ప్రతినిధి దుశ్యంత్ రెడ్డి 

ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో మాజీ డీసీసీ అధికార ప్రతినిధి దుశ్యంత్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో బల్సుల అనిత హరిక్రిష్ణ యాదవ్, ధోరేమోని ఆంజనేయులు నూతన గృహ ప్రవేశం కార్యక్రమానికి మాజీ డీసీసీ అధికార ప్రతినిధి దుశ్యంత్ రెడ్డి పాల్గొని ఏర్పాటు చేసిన సత్యనారాయణ వ్రతంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాల ప్రజలు అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తుందని మున్ముందు మరింత అభివృద్ధి పథంలో పల్లెలు ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తారని తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు కూడా త్వరలోనే మంజూరు అవుతాయని , ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గుడిసెలు ఉన్న వారికి, నిరుపేదలకు మాత్రమే మంజూరు అవుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, బాల్ రాజ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -