- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త. పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు ఏడాదికి 10 రోజులు ‘నో బ్యాగ్ డే’ను అమలు చేయనున్నారు. 2026-27 విద్యా క్యాలెండర్ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. ప్రతి నెలా మూడో శనివారం ఈ బ్యాగ్‌లెస్ డేను నిర్వహిస్తారు. ఆ రోజుల్లో విద్యార్థులు పుస్తకాలు లేకుండా పాఠశాలలకు వచ్చి క్షేత్ర పర్యటనలు, సైన్స్ ప్రయోగాలు, క్విజ్‌లు, బాలసభలు, చిత్రలేఖనం, నాటికలు వంటి విభిన్న కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థానిక నిపుణుల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించి, అనుభవపూర్వకంగా నేర్చుకునేలా చర్యలు తీసుకుంటారు.
- Advertisement -



