నవతెలంగాణ – సత్తుపల్లి : పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, స్వర్గీయ పెండ్యాల కృష్ణబాబు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. పెండ్యాల విగ్రహానికి మంత్రి తుమ్మల పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన పెండ్యాల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని పెండ్యాల కృష్ణబాబు సేవలను స్మరించుకున్నారు. కృష్ణబాబు ప్రజా సంక్షేమానికి చేసిన కృషిని, ఆయనతో తమకున్న అనుబంధాన్ని నాయకులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే ‘పెండ్యాల’ విగ్రహావిష్కరణలో మంత్రి తుమ్మల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



