Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి ఉన్నత పాఠశాలలో ఎన్ సీసీ కోర్సులు ప్రవేశపెట్టండి

డోంగ్లి ఉన్నత పాఠశాలలో ఎన్ సీసీ కోర్సులు ప్రవేశపెట్టండి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో శశాంక్ పటేల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు అధికారులకు రెండు ఫిర్యాదులు అందజేశారు. అందులో మొదటిది.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్ సిసి కోర్సును ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కోర్సు చేయాలంటే విద్యార్థులు జిల్లా కేంద్రమైన కామారెడ్డికి దాదాపుగా 100 కిలోమీటర్లు వెళ్ళాలని తెలిపారు. ఈ కోర్సు వల్ల ప్రభుత్వ పోటీ పరీక్షల్లో వెయిటేజ్ మార్కులు ఉంటాయని గుర్తు చేశారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, ఎన్ సీసీ ఫార్ముల ఉన్న ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టి ఈ ప్రాంత విద్యార్థులకు ఈ కోర్సు అందించాలని విన్నవించారు.

మరొకటి.. గత పదేండ్లుగా మండల కేంద్రంలోని మెన్ రోడ్డు గుండా ఉన్న ఎస్సీ కాలనీలో అభివృద్ధికి నోచుకోని పెద్ద మురికి కాలువల పనులను చేపట్టారు. కానీ ఆ మురికి కాలువ పనుల మెజర్‌ మెంట్‌ రికార్డు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని వాపోయారు. వెంటనే ఎంబి రికార్డ్ చేసి నిధులు మంజూరు చేయించాలని ప్రజావాణి వినతిపత్రంలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -