Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైభవంగా ప్రారంభమైన సింగం ఫ్యాషన్ హౌస్

వైభవంగా ప్రారంభమైన సింగం ఫ్యాషన్ హౌస్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సింగం ఫ్యాషన్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ హాజరై రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్‌ మాట్లాడుతూ సింగం ఫ్యాషన్ హౌస్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన వస్త్రాలు, ఆధునిక ఫ్యాషన్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వ్యాపారం విజయవంతంగా కొనసాగుతూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అంజాద్, రామ్మోహన్, కాళ్ల గణేష్, కో-ఆప్షన్ సభ్యుడు ముబాషీర్, నాయకులు నాగరాజు, రాములు, వేణు, వ్యాపార నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -