Tuesday, September 1, 2026
E-PAPER
Homeజిల్లాలుఅర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పారు. మండలంలోని బైరంపల్లి, కాంచనపల్లి, దోనూర్ సింగం దొడ్డి చౌట కుంట తండా, ఎదులబాయి తండా, పసిగుండ్లపల్లి, వేముల, వాడియాల గ్రామాలలో అర్హులైన పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ఆయా గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

అర్హత ఉండి రేషన్ కార్డులు లేని పేద ప్రజల ఇబ్బందులను గమనించి, పారదర్శకమైన పద్ధతిలో ఈ సరికొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులకు నేరుగా అందేలా చూస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మించుకోకుంటే పేదలకు కాంట్రాక్టర్ ద్వారా ఇండ్లు నిర్మించి ఇస్తానని చెప్పారు. ఇందిరమ్మ బిల్లులు మంజూరు అయినంక కాంట్రాక్టర్కు అందజేయాలని లబ్ధిదారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో  వర్క్స్ బోర్డ్  మాజీ చైర్మన్ గౌస్ రబ్బాని, జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, తహసిల్దార్ రాఘవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొహమ్మద్ గౌస్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్,సర్పంచులు శ్రీనివాస్ గౌడ్, అంజిరెడ్డి, ధర్మానాయక్, శ్రీశైలం యాదవ్, అంజమ్మ, చంద్రయ్య గౌడ్, నాగరాజుగౌడ్, రాజు నాయక్, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చెన్నయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బంగారు, సత్తయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బరిగల వెంకటయ్య, గడ్డల విజయ్ కుమార్, సంపత్ కుమార్, జహంగీర్, సాయిలు, వెంకటేష్ గౌడ్, నరేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకట శివప్రసాద్, మల్లికార్జున రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జంగయ్య, శంకర్ నాయక్, నరసింహ, ఉస్మాన్, బీర్ల మల్లయ్య, జహీర్, ఆదాం, పంచాయతీ కార్యదర్శులు, జి పి ఓ లు, మహిళా సంఘం సభ్యులు డీలర్లు ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -