Wednesday, September 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభిన్న ఫాంటసీ ఎంటర్‌టైనర్‌

భిన్న ఫాంటసీ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

హీరో ఫ‌హాద్ ఫాజిల్‌ నటిస్తున్న కొత్త సినిమా‘డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్’. షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌పై ఎస్.ఎస్. కార్తికేయ ఈ ప్రాజెక్ట్‌ను ‘బాహుబ‌లి’ ఫ్రాం చైజీ నిర్మాతలైన ఆర్కా మీడియాతో క‌లిసి రూపొం దిస్తున్నారు. శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత‌లు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ క‌ల‌సి ఈ ఆసక్తికరమైన, కంటెంట్ రిచ్ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే వినోదాన్ని పంచుతూ ఆసక్తిని రేకెత్తించిన టీజర్ త‌ర్వాత మేకర్స్ రిలీజ్‌ చేసిన ‘కేకు వాకు’ అనే వీడియో సాంగ్‌కు ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.
ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా అక్టోబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న‌ట్లు అనౌన్స్ చేస్తూ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ఫ‌హాద్ ఫాజిల్ మెట్ల‌పై కూర్చుని ఉన్నారు. త‌న ప‌క్క‌నే చిన్న పాప స్సారా కూర్చుని ఉంది. ఆమె ఓ క‌ల‌ర్ స్టిక్‌ను ప‌ట్టుకుని ఇంద్ర‌జాలం చేస్తోంది. డ‌బ్బు వ‌ర్షంలా కురుస్తుంది. దాన్ని చూసిన ఫ‌హాద్ ఆనందంతో ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -