Wednesday, April 15, 2026
E-PAPER
Homeజాతీయంపవన్‌ ఖేరాకు ముందస్తు బెయిల్‌పై సుప్రీం స్టే

పవన్‌ ఖేరాకు ముందస్తు బెయిల్‌పై సుప్రీం స్టే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్‌ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరాపై గువాహటిలో కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన అసోంలో సంబంధిత కోర్టును ఆశ్రయించడానికి అవకాశం కల్పిస్తూ వారం రోజులపాటు తాత్కాలిక ముందస్తు బెయిలును మంజూరు చేస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. తాజాగా అస్సాంలోని గువాహటిలో నమోదైన కేసులో కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా (Pawan Khera)కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ముందస్తు బెయిల్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -