-వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డు.. మరమ్మతులు చేయక ప్రమాదకరంగా మారిన వైనం
నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని గొల్లపల్లి స్టేజి వద్ద వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. రోడ్డు దెబ్బతిని చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు రోడ్డుపై కొమ్మలను అడ్డుగా పెట్టారు. అయితే రాత్రివేళల్లో వాహనదారులకు ఈ కొమ్మలు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “కొమ్మలు మాత్రమే అడ్డుపెడితే ప్రమాదం ఆగుతుందా?” అని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్డును పరిశీలించి, వెంటనే మరమ్మతులు చేపట్టి వాహనదారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కొమ్మలు అడ్డుపెడితే ప్రమాదం ఆగుతుందా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



