కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ యువ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) రెండేళ్ల పాటు నిషేధం విధించింది. తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించడంపై ఆరోపణలు రావడంతో బిసిసిఐ చర్యలు చేపట్టింది. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో ఆడేందుకు ఇటీవలే రోహిత్ అండర్ -19 జట్టుకు ఎంపిక అయ్యాడు. కానీ ఈ నిషేధంతో అతడిని జట్టునుంచి తప్పించారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన రోహిత్ యాదవ్ గత జులైలో అండర్ -19 జట్టుతో శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. అనధికారిక టెస్టులో ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో ఆసీస్‌తో సిరీస్‌కు భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడే రోహిత్ యాదవ్ వయసు ధృవీకరణ పత్రాలను పరిశీలించగా.. వయసులో వ్యత్యాసం తెలిపింది. రోహిత్ వద్ద 2007, 2009, 2010 మూడు ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు బిసిసిఐ గుర్తించింది. ఈ క్రమంలో బోర్డు రోహిత్‌పై రెండేళ్లపాటు నిషేధం విధించినట్లు అన్ని రాష్ట్రాల బోర్డులకు తెలియజేసింది.
రోహిత్ యాదవ్‌పై నిషేధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



