Saturday, September 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం

తాడిచెర్ల హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకునిమండల కేంద్రమైన తాడిచర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం పాఠశాల ప్రాధానోపాద్యాయులు సిహెచ్ తిరుపతి అద్వ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే పల్లి రాధాకృష్ణ జీవిత చరిత్ర, ఆయన దేశానికి చేసిన సేవలు, అనుభవించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -