- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకునిమండల కేంద్రమైన తాడిచర్ల గ్రామ పరిధిలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం పాఠశాల ప్రాధానోపాద్యాయురాలు బి.పద్మ అద్వ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే పల్లి రాధాకృష్ణ జీవిత చరిత్ర, ఆయన దేశానికి చేసిన సేవలు, అనుభవించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



