Saturday, September 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎంపీపీ ప్రజ్ఞకుమార్ మృతి

మాజీ ఎంపీపీ ప్రజ్ఞకుమార్ మృతి

- Advertisement -

ఆయన మృతి పట్ల పలువురు నాయకుల దిగ్భాంతి
నవతెలంగాణ-మద్నూర్

మద్నూరు ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ ప్రజ్ఞకుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు మండల ప్రజలు ద్విగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడు ప్రజ్ఞ కుమార్ ఎంపీపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న సమయంలో ఎంపీపీగా కొనసాగారు. ఆయన ఎంపీపీ గా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. జుక్కల్ ఎమ్మెల్యేగా అరుణాతార కొనసాగిన కాలంలో చిన్న వయస్సులోనే ఎంపీపీ పదవి సాధించడం అప్పట్లో ప్రజ్ఞకుమార్ చిన్న వయసులోనే ఎంపీపీ కావడం ఆయనకు ప్రతి ఒక్కరు అభినందించారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ శనివారం అకాల మరణం చెందడం బంధుమిత్రులకు వివిధ పార్టీల నాయకులకు మండల ప్రజలకు దిగ్బంతిని  కలిగించింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -