Sunday, September 6, 2026
E-PAPER
Homeకవితనీ వాళ్లెవరు..?

నీ వాళ్లెవరు..?

- Advertisement -


అంతరాత్మ నాలోని వివేకాన్ని
“నీ వాళ్లెవరు?” అని ప్రశ్నించింది
జేబుల్లో శబ్దమయ్యే లోకం
గుండెల మాటల్ని వినలేకుంది..!
డబ్బుంటే నీ పేరు నీ వాళ్ళతో
చుట్టూ తిరిగే గాలిలా విస్తరిస్తుంది,
ఖాళీ చేతులైతే మాత్రం నీ నీడే
నీ వెంట నడవడానికి కూడా జంకుతుంది..!
నేనున్నానో, పోయానోనని అడిగే తీరిక
నా వాళ్ళకి కూడా లేదు,
అవసరాల లాభనష్టాల తూకంలో
అనుబంధాలు తేలిపోతున్నాయి..!
కట్టె వేస్తే శవం కాలుతుందో లేదో
తెలియని ఈ కలి కాలంలో,
నోట్ల కట్టలు వేస్తే మాత్రం
అగ్గి ఆకాశానికి ఎగబాకుతుంది..!
రక్తసంబంధాలు మానవ సంబంధాలు
లెక్కల అంకెల్లో కరిగిపోతున్నాయి,
శేషప్రశ్నగా నా వాళ్లెవరు..
డబ్బులా? లేక మనుషులా?
బంధాల దహనం కాదిది,
విలువల హననం ఇది,
సహకారం నైతికత బూడిదై
గుండెలు పిండే వ్యథ ఇది..!
అయినా విలువల బూడిదలో
ఇంకా దగ్ధంకాని మానవత్వమొకటి
అంకెల అగాధంలోకి జారిపోని
చిన్న ఆశావహ గీతం పాడుతోంది…!

ప్రొ. వాసాల వరప్రసాద్, 9490189847

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -