Sunday, September 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌పై మూడు రోజులు దాడులు బంద్: పుతిన్

ఉక్రెయిన్‌పై మూడు రోజులు దాడులు బంద్: పుతిన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై దాడులను మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా దౌత్యవేత్తలతో జరగనున్న చర్చలకు ముందు పుతిన్ ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అధికారికంగా ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా దౌత్యవేత్తల బృందం మాస్కోకు రానున్న నేపథ్యంలో పుతిన్ ఈ ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. ఈ మూడు రోజుల వ్యవధిలో రాజధాని కీవ్‌తో సహా ఉక్రెయిన్‌లోని ఏ నగరంపైనా దాడులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -