- Advertisement -
దార కాంతి కుమారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రతి ఒక్కరు సమాజ సేవలో భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి దార కాంతి కుమారి కోరారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆమె జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయ సిబ్బంది ఒఎస్డీ విజరు కుమార్, పీఆర్వో అమృత్, బంధువులు, స్నేహితులు పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేవా భావంతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. యువత సమాజ నిర్మాణంలో ముందుండాలన్నారు.
- Advertisement -



