Friday, April 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం18న మ్యూజియంల్లోకి ఉచిత ప్రవేశం

18న మ్యూజియంల్లోకి ఉచిత ప్రవేశం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
ప్రపంచ వారసత్వ దినోత్సవం నేపథ్యంలో ఈనెల 18న రాష్ట్రంలోని అన్నీ మ్యూజియంల్లోకి ఉచిత ప్రవేశం కల్పించనున్నట్టు తెలంగాణ వారసత్వ శాఖ ప్రకటించింది. తమ ఆధీనంలో ఉన్న అన్నీ మ్యూజియంలు, స్మారక కట్టడాలలోకి శనివారం ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నట్టు తెలియజేసింది. హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఉన్న రాష్ట్ర మ్యూజియంలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలను కూడా నిర్వహిస్తున్నట్టు వివరించింది. తెలంగాణలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో దానిని వేడుకగా జరుపుకోవడంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ఆ శాఖ తెలియజేసింది. సందర్శకులు హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఉన్న రాష్ట్ర మ్యూజియం, కుతుబ్‌ షాహీ సమాధులు; భోంగీర్‌ కోట, ఎలాగండల్‌ కోట, కరీంనగర్‌, వరంగల్‌, పిల్లలమర్రి, పనగల్‌ ఆలంపూర్‌ మ్యూజియంలు మొదలైన ప్రసిద్ధ ప్రదేశాలను ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా సందర్శించవచ్చని వివరించింది. రాష్ట్ర వారసత్వ సంపద అయిన ఈ ప్రదేశాలను సందర్శించవలసిందిగా విద్యార్థులు, చరిత్ర ప్రియులతోపాటు సాధారణ ప్రజలను ఆహ్వానిస్తున్నట్టు వారసత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ఇతర వివరాలకు తెలంగాణ వారసత్వ శాఖను 040-23234942 నంబర్‌లో సంప్రదించాలని ఆ శాఖ కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -