- Advertisement -
ఏండ్ల తరబడి ఎండా వానకు మగ్గుతున్న వాహనం
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణంలో ఏండ్ల తరబడి ఎండా వానకు తడుస్తూ శిథిలావస్థకు చేరుకునే దుస్థితికి చేరుకుంది. అత్యవసర సమయాల్లో రోగులకు ఎంతో ఉపయోగపడే ఈ వాహనాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రోజుల తరబడి నిలిచిపోవడంతో వాహనం దాదాపుడా తుప్పుపట్టిపోతోంది. మండల పరిధిలోని అన్ని గ్రామాల పేదలకు ఈ వాహనం ఎన్నో సేవలను అందించిందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పేదలకు, అనారోగ్య బాధితుల సౌకర్యార్థం వినియోగంలోకి తీసుకురావాలని, లక్షలు వెచ్చించి కొన్న ప్రజాధనం వృధాకాకుడా చూడాలని కోరుతున్నారు.
- Advertisement -



