Monday, September 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవివాహ వేడుకలో విషాదం

వివాహ వేడుకలో విషాదం

- Advertisement -


కాంగోలో ఘోర అగ్నిప్రమాదం
భవనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
22 మందికిపైగా మృతి
సహాయక చర్యలను చేపట్టిన రెస్క్యూ బృందాలు
కిన్షాసా :
కాంగో రాజధాని కిన్షాసాలోని ఒక వివాహ వేడుకలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 22 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. లింగ్వాలా ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో వివాహ వేడుక జరుగుతుండగా ఆకస్మత్తుగా మంటలు చెలరేగాయి. ఇరుకైన కారిడార్ల కారణంగా మంటల నుంచి తప్పించుకోవడానికి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది భవనం లోపల నుంచి సురక్షితంగా బయటకు వచ్చేయగా, మరికొంతమంది చిక్కుకుపోయారు. దీంతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ప్రమాద సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. పలు మృతదేహాలను వెలికితీయగా క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగో ఉప ప్రధాని జాక్వెమిన్ షబానీ ఇదొక పెను విషాదమని పేర్కొన్నారు.: కాంగో రాజధాని కిన్షాసాలోని ఒక వివాహ వేడుకలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 22 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. లింగ్వాలా ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో వివాహ వేడుక జరుగుతుండగా ఆకస్మత్తుగా మంటలు చెలరేగాయి. ఇరుకైన కారిడార్ల కారణంగా మంటల నుంచి తప్పించుకోవడానికి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది భవనం లోపల నుంచి సురక్షితంగా బయటకు వచ్చేయగా, మరికొంతమంది చిక్కుకుపోయారు. దీంతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ప్రమాద సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. పలు మృతదేహాలను వెలికితీయగా క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగో ఉప ప్రధాని జాక్వెమిన్ షబానీ ఇదొక పెను విషాదమని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -