పాల్గొననున్న 20 వేల మంది రన్నర్లు
నవతెలంగాణ-హైదరాబాద్ :
ఈ నెల 27న హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో జరుగనుందని నిర్వాహకులు ఎంఈఐఎల్ డైరెక్టర్ సుధా రెడ్డి వెల్లడించారు. ఎంఈఐఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పింక్ పవర్ రన్ మూడో ఎడిషన్లో సుమారు 20 వేల మంది రన్నర్లు పోటీపడతారని, రూ.75 లక్షల భారీ నగదు బహుమతి అందించనున్నారు. పింక్ పవర్ రన్లో తొలిసారి హాఫ్ మారథాన్ (21.097 కిమీ) నిర్వహించనున్నారు. 10కె, 5కె, 3కె ఈవెంట్లు సైతం ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో 2025 మిస్ వరల్డ్ ఒపల్ సుచతా చువాంత్, రొమ్ము క్యాన్సర్ సర్జన్ డాక్టర్ ప్రజ్క్ష చిగురుపాటితో కలిసి సుధా రెడ్డి పింక్ పవర్ రన్ జెర్సీ, మెడల్స్ ఆవిష్కరించారు.
27న పింక్ పవర్ రన్
- Advertisement -
- Advertisement -



