Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'గాంధీ' సూపరింటెండెంట్‌గా 
డాక్టర్ ఉషారాణి

‘గాంధీ’ సూపరింటెండెంట్‌గా 
డాక్టర్ ఉషారాణి

- Advertisement -


బాధ్యతలు స్వీకరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో

​సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌గా డాక్టర్ ఉషారాణి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆ పోస్టులో కొనసాగిన డాక్టర్ వాణి డీఎంఈగా ఉద్యోగోన్నతిపై వెళ్లడంతో సూపరింటెండెంట్ పోస్టు దాదాపు నెల రోజులుగా ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో డాక్టర్ టి.ఉషారాణిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఉషారాణి గాంధీ ఆస్పత్రికి బదిలీపై రావడంతో ఆమెకు ఇప్పటివరకు ఇన్‌‌చార్జి సూపరింటెండెంట్ గా కొనసాగిన డీఎంఈ డాక్టర్ వాణి బాధ్యతలను అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -