స్పీకర్ దళితుడంటూ మంత్రులే అవమానించారు : బీఆర్‌ఎస్
కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హత్యకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర చేశారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చావును కోరుకుంటున్నానేని షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడటాన్ని ఖండించారు.
కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదనీ, వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయ్యేవాడు కాదనీ, రేవంత్ రెడ్డి సీఎం అయ్యే వాడు కాదని చెప్పారు. కేసీఆర్ చావు కోరితే, ఉద్యమకారుల చావును కోరుకున్నట్టేనినని అన్నారు. వీర్లపల్లి శంకర్ మార్గదర్శకులు రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కూడా ఇదే భాష కొల్లాపూర్, కొడంగల్ సభల్లో మాట్లాడారని అన్నారు. ఇలాంటి క్రూరమైన భాషను ఖండించామనీ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ దళితుడంటూ మంత్రులే అవమానించారని అన్నారు.
కేసీఆర్ హత్యకు రేవంత్‌రెడ్డి కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



