Wednesday, September 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోమూర్ లో రీ సర్వే పనులు పరిశీలించిన ఆర్డిఓ

సోమూర్ లో రీ సర్వే పనులు పరిశీలించిన ఆర్డిఓ

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండలంలోని సోమూరు గ్రామానికి శివారుకు నక్ష మ్యాపులు లేకపోవడంతో గత రెండు నెలలుగా ప్రభుత్వాధికారులు గ్రామ శివారు ప్రాంతాన్ని రీసర్వే పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం భాన్సువాడ ఆర్డీఓ రవీందర్‌రెడ్డి సోమూరును సందర్శించి, భూముల రీ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. భూ రీ సర్వేతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, ప్రభుత్వ భూములను గుర్తిస్తూ..హద్దులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ సంగ్రామ్ పటేల్, మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్, డిఐ తిరుమలేష్, మురళీధర్ మండల సర్వేయర్ వెంకట్రావు, లైసెన్సు సర్వేర్లు సోమూరు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -