కథలపోటీ
వాసాఫౌండేషన్ సాహితీకిరణం సంయుక్త ఆధ్వర్యంలో డా||వాసా ప్రభావతి స్మారక కథలపోటీ నిర్వహిస్తున్నది. కథలు కుటుంబవ్యవస్థకి సంబంధించినదై ఉండి కుల, మత, వర్గ ప్రశస్తిలేకుండా కథలు ఉండాలి. కథలో అశ్లీలత ఉండకూదు. కథ రాతప్రతిలో ఎ4 సైజులో నాలుగుపేజీలు, డిటిపి అయితే రెండు పేజీలకు మించరాదు. కథలు పోస్ట్/కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి. కథలు చేరవలసిన ఆఖరు తేది.30.04.2026. కథలు పంపవలసిన చిరునామా: సాహితీకిరణం, ఇం.నెం. 11-13-154, అలకాపురి, రోడ్‌నెం.3, హైదరాబాద్-500102. సెల్:9490751681
పొత్తూరి సుబ్బారావు సంపాదకులు
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో
28న ‘కథా కార్యశాల’
నవతెలంగాణ హైదరాబాద్: నేటితరం యువతను సాహితీవేత్తలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈ నెల 28న కథా కార్యశాల సదస్సును నిర్వహిస్తు న్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కథలు ఎలా రాయాలి, కథా నిర్మాణ పద్ధతులు, వస్తువులు ఎలా ఎన్ను కోవాలి అనే పలు అంశాలపై ప్రముఖులు ఈ సదస్సులో మెలకువలను నేర్పిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 91824 45692లో సంప్రదించి ఈ నెల 23వ తేదీలోగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -


