– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రాములు
– వ్యకాస మహబూబ్నగర్ జిల్లా మహాసభ
– నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ -జడ్చర్ల
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి.. కేరళ ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో గల అంబేద్కర్ కళాభవన్ నిలయంలో ఆదివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 12వ మహాసభ జరిగింది. ముందుగా జెండాను జిల్లా అధ్యక్షులు పి.జగన్ ఆవిష్కరించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మహాసభ ప్రారంభోపన్యాసం చేశారు. ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 20-21 ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా కేరళ అభివృద్ధిని కించపరిచేలా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటం దుర్మార్గమన్నారు. కేరళ అభివృద్ధిలో సగమైనా తెలంగాణలో జరిగిందా అని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మే నెలలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో చర్చించి ప్రజాఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు. మహాసభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, సీఐటీయూ రాష్ట్ర , జిల్లా నాయకులు కిల్లె గోపాల్, ఎం.దీప్లా నాయక్, సత్తయ్య పాల్గొని సందేశమిచ్చారు.
నూతన కమిటీని ఎన్నిక
వ్యకాస జిల్లా నూతన కమిటీ 19 మందితో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పి.జగన్, కడియాల మోహన్, సహాయ కార్యదర్శులుగా హనుమంతు రాములు, శివ నీల, భగవంతు, రాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఈర్లపల్లి యాదయ్య, సాయిలు, కమిటీ సభ్యులుగా పాండు, ఈర్లపల్లి యాదయ్య, సాయిలు, జయరాములు, శ్యాంసుందర్, మంద మహేష్, గోపాల్ను ఎన్నుకున్నారు.
హామీల అమలేదీ..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



