– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
– రైతు సంఘం గద్వాల జిల్లా కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-అలంపూర్
ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందివ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రైతు సంఘం జోగులాంబ గద్వాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం ఆదివారం అలంపూర్ మండల పరిధిలోని లింగనవాయి గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందకపోవడం వల్ల అలంపూర్ ప్రాంత రైతులు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్డీఎస్ని ఆధునీకరించాలని, తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గద్వాల ప్రాంతంలోని సీడ్ పత్తి రైతులతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లా నూతన కమిటీ..
తెలంగాణ రైతు సంఘం గద్వాల జిల్లా నూతన అధ్యక్షులుగా జికె.ఈదన్న, కార్యదర్శిగా ఏ.వెంకటస్వామి, కోశాధికారిగా సుంకాపురం మల్లేష్ ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా బి.నర్సింహ, జి గణేష్, కె.గోపాల్, నర్సింహారెడ్డి, సి.మధు, నాగేంద్ర నాయుడు, వీరేష్, బత్తలయా, మల్లయ్య, మొగలన్న తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చివరి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



