Monday, April 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలి
ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ హైదరాబాద్‌ రీజియన్‌ కార్యదర్శి కృష్ణ అధ్యక్షత ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రచార కార్యదర్శి పి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమ్మెను విచ్చిన్నం చేసే చర్యలను మానుకోవాలని హితవు పలికారు. విద్యుత్‌ బస్సుల పేరుతో గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోని కార్మికులను ఇతర రీజియన్‌ లకు పంపే చర్యలను విడనాడాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ యూనియన్లపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. 27 నెల్ల కాలంలో కనీసం ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరపలేదని తెలిపారు. మహాలక్ష్మి స్కీమ్‌ అమలు ఫలితంగా కార్మికులు ఇబ్బందులు పడటమే కాకుండా ఉద్యో గాలు కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీలో సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కార్మిక సంఘాలతో కనీసం చర్చలు జరప కుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరి స్తున్నదని విమర్శించారు. సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షు లు రుద్ర కుమార్‌, ఏఐటీయూసీ జిల్లా నాయకులు నరసింహారెడ్డి, ఏఐఆర్‌ టీడబ్ల్యూఎఫ్‌ జిల్లా నాయ కులు రాజు, బీసీడబ్ల్యూ నాయకులు మోహన్‌, డీవైఎఫ్‌ఐ నాయకులు చైతన్య మాట్లా డారు. సమావేశంలో మహబూ బ్‌నగర్‌ రీజియన్‌ కేంద్రం లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ఖమ్మం రీజియన్‌ కేంద్రంలో ఉప ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, సూర్యాపేటలో రాష్ట్ర కార్యదర్శి బి సుధాకర్‌, సికింద్రాబాద్‌ రీజియన్‌ కేంద్రంలో ఉపాధ్యక్షులు కే గీత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -