ఆయా జిపిల నోటీస్ బోర్డులపై ప్రదర్శన
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం తాడిచెర్ల, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల, వల్లెంకుంట, కొయ్యుర్, ఎడ్లపల్లి, నాచారం గ్రామాల్లో ఖాళీగా ఉన్న 11 అంగన్ వాడి టీచర్ పోస్టులకు మొత్తం 293 దరఖాస్తులు వచ్చాయని, భూపాలపల్లి జిల్లా డిడబ్ల్యూఓ మల్లీశ్వరి ఆదేశాల మేరకు గురువారం ఆయా గ్రామాల్లో పంచాయతీల నోటీస్ బోర్డులపై జాబితాలను ప్రదర్షించినట్లుగా సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి తెలిపారు. తాడిచెర్ల గ్రామంలోని సెంటర్-1కు 79, సెంటర్-2కు 78, సెంటర్-4కు 54, సెంటర్-7కు 20, పెద్దతూండ్ల గ్రామంలోని సెంటర్-2కు 14, సెంటర్-3కు 13, చిన్నతూండ్ల సెంటర్-కు 8, వల్లెంకుంట సెంటర్-1కు 12, నాచారం గ్రామంలోని సెంటర్-1 కు 3, కొయ్యుర్ సెంటర్ కు 6,ఎడ్లపల్లి సెంటర్ కు 2 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
11 అంగన్వాడి టీచర్ పోస్టులకు 293 మంది దరఖాస్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



