Monday, April 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలే శ్రేయస్కరం

పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలే శ్రేయస్కరం

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, నేటి పోటీ ప్రపంచంలో బాధ్యతాయుతమైన, క్రమశిక్షణతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ పాఠశాలలకే సాధ్యమని అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బింగి లక్ష్మయ్య అన్నారు. సోమవారం మండుటెండల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించి, ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత విద్య పుస్తకాలు యూనిఫామ్ లు మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను వివరించి మాట్లాడారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అనుభవం, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయడం జరుగుతుందని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు.

ప్రభుత్వ బడులలో చదువులు మీ పిల్లల జీవితానికి వెలుగునిస్తుందని అన్నారు. మానసిక ఉల్లాసం, సృజనాత్మకత కోసం చిత్రలేఖనం పాటలు నృత్యం లాంటి సహ పాఠ్యాంశాలు ఉంటాయని తెలిపారు. క్రీడల్లో జిల్లా రాష్ట్ర జాతీయస్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించి వారి బంగారు భవితకి బాటలు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం కార్తీక్ రెడ్డి, దేవేందర్, నరేందర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -