Friday, September 11, 2026
E-PAPER
Homeనల్లగొండఉత్తమ ఉపాధ్యాయురాలిగా కొండ్ర సైదమ్మ

ఉత్తమ ఉపాధ్యాయురాలిగా కొండ్ర సైదమ్మ

- Advertisement -


నవతెలంగాణ-హైదరాబాద్: చందుపట్ల MJP బాలికల పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న కొండ్ర సైదమ్మ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి (MEO) అంబటి అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుత్త మంజుల చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును అందజేశారు. ఆ తర్వాత కట్టంగూర్‌లోని ZPHS పాఠశాలలో తోటి ఉపాధ్యాయులు ఆమెను ఘనంగా సన్మానించారు.

కొండ్ర సైదమ్మ బెస్ట్ టీచర్ అవార్డును స్వీకరించడం సంతోషంగా ఉందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, ముఖ్యంగా సైన్స్ సబ్జెక్ట్ లపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు సైదమ్మ కృషి అభినందనీయమని, విద్యాబోధనతో పాటు డిప్యూటీ వార్డెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ విద్యార్థుల సంక్షేమం కోసం సేవలందిస్తున్నారని కొనియాడారు.

ప్రిన్సిపాల్ పనసం మాధవి, ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది కొండ్ర సైదమ్మను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సైదమ్మ గారి భర్త కిషోర్ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యారంగంలో ఆమె చేస్తున్న సేవలకు ఈ అవార్డు తగిన గుర్తింపు అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -