Tuesday, April 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి

ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి

- Advertisement -

సమ్మెను నివారించాలి : సీఐటీయూ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఆర్టీసీలోని కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో సీఐటీయూ ఆఫీస్‌బేరర్స్‌ సమావేశాన్ని అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ నెల 22 నుండి జరప తలపెట్టిన సమ్మెను నివారించాలని ఈ సందర్భంగా చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ విజ్ఞప్తి చేశారు. సమ్మె కొనసాగితే అందుకు ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ వైఖరి వల్ల కార్మిక శాఖ నిర్వహించిన మధ్యవర్తిత్వాన్ని యాజమాన్యం లెక్కచేయటం లేదని పేర్కొన్నారు. ప్రజాపాలన అంటూనే గత ప్రభుత్వం మాదిరిగానే నేటి కాంగ్రెస్‌ నాయకులు కూడా కార్మిక ఉద్యమాలను అణిచేందుకు కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. సంవత్సరాల తరబడి సమస్యలు పరిష్కారం కోసం ఎదరు చూస్తున్న కార్మికులకు పోరాటం తప్ప మరో దారి ఉండబోదని తెలిపారు. పాలకులు ఆ సమస్యలు పరిష్కరించి, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
విద్యుత్‌ బస్సుల వల్ల ఆర్టీసీ ఉనికికే ప్రమాదమేర్పడిందని తెలిపారు. ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఆర్టీసి విస్తరణ జరగనందున పని భారం భరించలేని స్థితికి చేరిందని తెలిపారు. సంస్థను పరిరక్షించుకునేందుకు అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాలని సూచించారు. ఇప్పటికే పోరాటానికి పిలుపునిచ్చిన వారు అందరినీ కలుపుకుని ఐక్యంగా పోరాటాన్ని కొనసాగించాలనీ, ఆరు సంఘాల జేఏసీ అందుకు తగిన కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -