- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. లారీ ఢీ కొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బైరెడ్డిపల్లె మండలం మేకల నాగిరెడ్డి పల్లెకు చెందిన హేమచంద్ర(38) అతడి భార్య సరస్వతి(32), కుమార్తె లలిత (12)తొ కలిసి బైక్పై వీకోట మండలంలోని యడగూరులోని అత్తవారింటికి బయలుదేరాడు. ఈక్రమంలో కొమ్మరిమడుగు క్రాస్ రోడ్డు వద్ద లారీ వీరి బైక్ను ఢీ కొనడంతో భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన లలితను స్థానికులు హాస్పిటల్కు తరలించారు.
- Advertisement -



