సాకీ: కాషాయాన్ని నిలువరించి కదం తొక్కు తరుణాన
అరుణారుణ నాయకుడా మమ్ము వీడినావా
విద్యార్ధి నాయకుడా ఉద్యమాల ధీరుడా
ఇండియా అంత ఒకటంటూ నినదించిన వీరుడా
మోస్తాము ఎర్ర జండ ఢిల్లీ చేరుదాకా
నిను తలుస్తాము ఎప్పుడు మా హృదయం నిండా
పల్లవి: మతతత్వపు మత్తులో పొగచూరిన దేశానికి
వేగు చుక్కవే నీవు మా ఏచూరి
మేధావుల పార్టీలో ముఖచిత్రమె నీవు
కష్టజీవి ఎదలోన ధైర్యానివి నీవు //2//
చరణం 1:ఎంతపనీ చేశావు ఓ తెలుగు బిడ్డా
పోరుబాట మధ్యలో ఆగిపోయె నీ గుండె
మా అండగ నీవుంటే అది ఓ పండుగ
సాగిపోవాలి ఇంక అరుణారుణ జెండా
కన్నీటితొ నిండిన మా కన్నుల నిండా
వెలుగులే చిమ్మాలిక నీవే మా అండ//మత//
చ.2:ప్రపంచాన్ని చుట్టేసిన ఓ అరుణ వీరుడా
దేశదేశాలలో కమ్యూనిస్టుల సరిజేసిన
శూరుడవే నీవు ప్రగతిదారుడవే నీవు
భవితవ్యపు బాట నీవు భావానివి నీవు
విశ్వనరుడవే నీవు ఎర్ర జండ నీడ నీవు
నీ అడుగుల నడుస్తాం నీ రాగం పాడుతాం//మత//
చ.3:కాషాయాన్ని ఎదిరించగ కాంగిరేసు కావాలని
ఇండియా భావనను కలిగించి కదిలించి
ఫలితాలను చూపిన పరిశ్రమే నీవు
అలసత్వం కూడదన్న అభయమే నీవు
నీ మాటను పాటించగ మాటనే ఇస్తున్నం
నీ బాటను పయనించగ
అడుగులే వేస్తున్నం//మత//
చ.4:జీవితాన్ని త్యాగాల ఎరుపుతో నింపావు
దేహాన్ని దేశానికి బహుమతే ఇచ్చావు
సోషలిజం కమ్యూనిజం అర్థమే నీవు
దీక్షబూని చరిత్రనే రాసిన కలమే నీవు
నీ అంకిత భావానికి అందుకో లాల్ సలాం
నిను రోజూ స్మరియిస్తాం
ఇదిగో మా లాల్ సలాం//మత//
– జంధ్యాల రఘుబాబు,
9849753298
అరుణారుణ జెండా..మా ఏచూరి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



