Tuesday, April 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జేఈఈ మెయిన్స్ లో మెరిసిన సిద్దిపేట విద్యార్థులు

జేఈఈ మెయిన్స్ లో మెరిసిన సిద్దిపేట విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ – సిద్దిపేట 
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సిద్దిపేట విద్యార్థులు ఊడెం కౌశిక్ వర్ధన్ రెడ్డి, లుక్కా అక్షయ్ గుణ తమ సత్తా చాటి ఉత్తమ ర్యాంకులు సాధించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ)  జేఈఈ మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. జాతీయస్థాయిలో 16 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైనారు. ఈ ఫలితాల్లో సిద్దిపేట పట్టణానికి చెందిన ఊడెం రఘువర్ధన్ రెడ్డి – సుహాసినిల కుమారుడు ఊడెం కౌశిక్ వర్ధన్ రెడ్డి 1594వ ర్యాంకు, లుక్క రాజు – ఉమల కుమారుడు  అక్షయ్ గుణ 873 ర్యాంకుతో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 16 లక్షల విద్యార్థులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెండు లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు అర్హత కల్పిస్తారు. ఇందులో ఉత్తమ ఫలితాలు సాధించి ఐ ఐ టి బాంబేలో ప్రవేశం పొందడమే లక్ష్యంగా చదువుతున్నట్టు విద్యార్థులు తెలిపారు. ఉత్తమ ర్యాంకులు పొందడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -