Saturday, September 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు​నాణ్యమైన విద్యే లక్ష్యం

​నాణ్యమైన విద్యే లక్ష్యం

- Advertisement -

‘జెన్‌ ఆల్ఫా, జెన్‌ బీటా’కు సరిపడా విద్యా విధానం
ప్రపంచంలోనే బెస్ట్ ప్రాక్టీసెస్ ను తీసుకొస్తున్నాం
సలహాలు, సూచనలిస్తే స్వీకరిస్తాం
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య
అదే విద్యాశాఖ మంత్రిగా 
నా పనితీరుకు నిదర్శనం : విద్యా వ్యవస్థలో సంస్కరణలపై స్వల్పకాలిక చర్చలో 
సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాలను కూడా దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో సరికొత్త విద్యా విధానాన్ని రూపొంది స్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఆ వ్యవస్థలోకి ప్రపంచంలోనే బెస్ట్ ప్రాక్టీసెస్ ను తీసుకొస్తున్నామని ఆయన చెప్పారు. శుక్రవారం శాసన సభలో విద్యా వ్యవస్థలో సంస్కరణలపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో సీఎం మాట్లాడారు. తెలంగాణ విద్యా విధానంపై సభలో చర్చ జరగడం ఒక శుభ పరిణామమని అన్నారు. చర్చ సందర్భంగా సభ్యుల నుంచి వచ్చే సూచనలపై సమీక్షించి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్ని స్తుందని హామీ ఇచ్చారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రెండు అంశాలను ప్రాధాన్యతగా తీసుకున్నారని గుర్తు చేశారు. దేశంలోని ఏ విద్యా సంస్థ అయినా నెహ్రూ వేసిన పునాదులపైనే నిర్మితమైందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న చాలా యూనివర్సిటీలు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వేనని తెలిపారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొ స్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సీపెక్ సర్వేలో సామాజిక వెనుకబాటుకు ఆస్తులు, అంతస్తులు కాకుండా విద్య లేకపోవడమే కారణమని తేలిందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంతో పోటీ పడాలంటే విద్యా విధానంలో తీసుకు రావాల్సిన అంశంపై చర్చించాల్సిన అవసరం ఉందని అభి ప్రాయపడ్డారు. ఆ దిశగా విద్యా కమిషన్ ఏర్పాటు చేశామనీ, ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలిం చినట్టు తెలిపారు. అనంతరం కె. కేశవరావు నేతృత్వం లో కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆ కమిటీకి సభ్యులు సల హాలు, సూచ నలు అందిస్తే ప్రభు త్వం స్వీకరిం చేందు కు సిద్ధం గా ఉందని స్పష్టం చేశారు. విద్య కోసం బడ్జెట్ ను 15 శాతానికి పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2023-24 బడ్జెట్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాశాఖ కు రూ.19,093 కోట్లు కేటాయిస్తే, తమ ప్రభుత్వం 2024-25 బడ్జెట్ లో రూ.21,292 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. దానిని 2025-26 బడ్జెట్ లో రూ.23,108 కోట్లకు, 2026-27 బడ్జెట్ లో రూ. 26,647 కోట్లకు పెంచినట్టు తెలిపారు.

కేవలం మూడేండ్లలో విద్యా శాఖ బడ్జెట్ ను రూ.7,554 కోట్లకు పెంచామని వివరించారు. విద్యా శాఖకు పూర్తి స్థాయి మంత్రి లేరని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శిం చడాన్ని ప్రస్తావి స్తూ, ముఖ్య మంత్రి ఆ శాఖను నిర్వ హిస్తున్నా రంటే ఆది అత్యంత ప్రధాన మైనదని అర్థమని సీఎం తెలిపారు.ముఖ్య మంత్రిగా తాను విద్యపై సమీక్షిస్తే ఆ సమీక్షలో మొత్తం వ్యవస్థ ఉంటుందని చెప్పారు.ఆ మాత్రం తేడా కూడా సభ్యునికి తెలియకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. తనకు విద్యా శాఖపై ఒక ప్యాషన్ ఉందని తెలిపారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నే ఉందని, తలరాతలు మార్చేది విద్యా అని నమ్మి విద్యా శాఖ తన దగ్గర పెట్టుకున్నానని వివరణ ఇచ్చారు. ప్రపంచంలోనే బెస్ట్ ప్రాక్టీసెస్ ను తీసుకొచ్చే క్రమంలో కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు కొన్ని వివాదాలు తలెత్తుతాయంటూ, అలాంటిదే పాలిటె క్నిక్ కాలేజీలకు సంబంధించిన జీవో ఎంఎస్ నెం.97 అని సీఎం ఉదహరించారు.

​విద్యకు ప్రాధాన్యం :మంత్రి శ్రీధర్ బాబు
అంతకుముందు మంత్రి శ్రీధర్‌‌బాబు ఈ అంశంపై చర్చను ప్రారంభిస్తూ… తమ ప్రభుత్వానికి విద్య, వైద్యం ప్రాధాన్యాంశాలని చెప్పారు. అందుకే రెండున్నరేండ్లలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రీప్రైమరీ సెక్షన్లను ప్రారంభించామనీ, రెడీ టూ వర్క్ ఫోర్స్ గా తీర్చి దిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీగా ప్రారంభం, కరిక్యులంలో మార్పులు చేర్పులు, ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్ షిప్, డిగ్రీ, ఇంజినీరింగ్ లో బీఎఫ్ఎస్ఐ కోర్సులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ , ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఆ పథకాన్ని విద్యా సంస్థల్లో బోధన, భోధనేతర సిబ్బందికి వర్తింపు, 104 టీపీఎస్ ల ఏర్పాటు, టీ హబ్ తరహాలో వరంగల్ లో ఇంక్యుబేషన్ హబ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. తమ హయాంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ 27 శాతానికి పెరిగాయని హర్షం వ్యక్తం చేశారు. రూ.21 వేల కోట్ల అంచనాతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు వివరించారు. డైట్ చార్జీలను 40 శాతం, కాస్మొటిక్ చార్జీలను 212 శాతం పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. మెగా డీయస్సీని నిర్వహించడంతో పాటు టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టామని శ్రీధర్ బాబు తెలిపారు.

విదేశాల్లో విజయవంతంగా అమలవుతున్న విద్యా సంస్కరణలను పరిశీలించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులను అక్కడికి పంపించినట్టు తెలిపారు. రూ.500 కోట్లతో 93 కేజీబీవీలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించినట్టు వెల్లడించారు. కోఠి ఉమెన్స్ కళాశాలను మహిళా యూనివర్సిటీగా మార్చి రూ.500 కోట్లు కేటాయింపు, రాష్ట్రంలో 65 ఐటీలను ఏటీసీలుగా అభివృద్ధి చేసి, మరో 127 ఐటీఐలను ఏటీసీలుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోందని మంత్రి వివరించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించినట్టు తెలిపారు. తమకు బేషజాలు లేవనీ, విద్యావ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తుందని స్పష్టం చేశారు.

బేరీజు వేసుకోండి
గత ప్రభుత్వం పదేండ్లలో కేవలం 7,857 మంది టీచర్లను నియమించింది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 10,006 మంది టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేశాం. నేను విద్యా శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేల మందికి పెరిగింది.ఇదే నా పనితీరుకు నిదర్శనం.
ముఖ్యమంత్రి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -