నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా లోని విద్యుత్తు ఆర్టిజన్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, విద్యుత్తు ఆర్టిజన్ల పట్ల, అనుచిత వ్యాఖ్యలు చేసిన, అసభ్యకరమైన మాటలు మాట్లాడిన, అంకాపూర్ లైన్మెన్ దత్తాత్రేయ, అసిస్టెంట్ లైన్మెన్ జ్ఞానేశ్వర్, లను వీధుల నుండి వెంటనే సస్పెండ్ చేయాలని కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ జేఏసీ జాక్ ఒక ప్రకటనలొ పిలుపునిచ్చింది.
విద్యుత్ ఆర్టిజన్ల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, హీనంగా మాట్లాడిన వీరిద్దరిని విధుల్లోంచి తొలగించాలని, ఉమ్మడి ఆల్మండ్ సీనియర్ అడ్వైజర్ ఎం. నాంపల్లి డిమాండ్ చేశారు. వీరిద్దరూ విద్యుత్ సంస్థకు ద్రోహులేనని వీరు సంస్థలో పనిచేయడం ఏమాత్రం సరి కాదని వారన్నారు. ప్రకటించిన వారిలో జాక్ నాయకులు, బాలేశం, పెద్ద స్వామి, ఉప్పు స్వామి, రాజు, బాల్ నర్సు,రాజేందర్. రాములు,సురేష్,మహేష్, రాజిరెడ్డి,స్వామి, నర్సా గౌడ్, జిల్లా నాయకులు, హరి,కృష్ణ గౌడ్, జై సింహా రెడ్డి, నాంపల్లి, నరేష్ లతోపాటు అధిక సంఖ్యలో ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు.



