నిందితులకు కఠిన శిక్ష పడాలి
పోరిక కిరణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రానికి చెందిన ఇరుగు శ్రావణ్-మమత ల 4సంవత్సరాల కుమారుడు అశ్రీత్ నందన్ పసి బాలుడు అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని,ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసిందని బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పోరిక కిరణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కిరణ్ స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు ఈరుగు శ్రావణ్ ఇంటికి వెళ్లి బాలుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు.
ఇంకా జీవితాన్ని సరిగా చూడకముందే నందన్ ఈ లోకాన్ని విడిచిపెట్టడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.విషాదంలో మునిగిపోయిన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించిన ఆయన, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కన్నబిడ్డను కోల్పోవడం ఎంతటి వేదనో మాటల్లో చెప్పలేం. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలి. మీకు మేమంతా అండగా ఉంటాం” అంటూ భరోసా ఇచ్చారు.బాధలో ఉన్న ఆ కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబంలో ఉన్న ఇద్దరు కుమార్తెలలో ఒక్కరికి 10వ తరగతి వరకు తన విద్యా సంస్థ లో పూర్తి ఉచిత విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు.వారి భవిష్యత్తుకు తాను అండగా ఉంటానని తెలిపారు.
ఈ ఘటనకు కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమాయక చిన్నారి ప్రాణం తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదని, వారికి కఠిన శిక్ష పడాలని అన్నారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని, తల్లిదండ్రులకు ఈ దుఃఖాన్ని భరించే మనోధైర్యం ప్రసాదించాలని పోరిక కిరణ్ కుమార్ ప్రార్థించారు. అదేవిధంగా ఎన్టీఆర్ కాలనిలో నంబురి శేషమ్మ 80సం” ఇటీవలే మరణించగా ఆమెకు నివాళులర్పించారు వారి కుటుంబానికి 2 వేల రూపాయల సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లకావత్ నర్సింహ నాయక్, గ్రామ అధ్యక్షుడు అక్కినపల్లి రమేష్, మాజీ సర్పంచ్ భూక్య దేవనాయక్, వార్డ్ మెంబర్ అజ్మీరా స్వప్న సీనియర్ నాయకులు పెండం హేమాద్రి, బొల్లం శివ,కంపాటి వెంకట కృష్ణ, మునగాల వెంకన్న, కీర్తి రవి, ఇంద్ర రెడ్డి, లింగ రెడ్డి,సాదిక్, అమరారపు గాంధీ తదితరులు పాల్గొన్నారు.



