రఘుకుంచె టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా అనేది ట్యాగ్‌లైన్. మోటూరి టాకీస్ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు.
వాణి రవికుమార్ మోటూరి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం డైరెక్టర్ చైతన్య మోటూరి మీడియాతో ముచ్చటించారు.
గేదెల రాజు అనే రౌడీ షీటర్ క్యారెక్టర్‌కు రఘు కుంచె పర్పెక్ట్‌గా సెట్ అవుతారని అనిపించింది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో రౌడీల గురించి నాకు తెలిసిన విషయాలు, స్థానికంగా జరిగిన ఘటనలు..ఇవన్నీ కలిపి ఈ కథ రాసుకున్నాను. డెయిర్ ఫామ్ నడిపే గేదెల రాజు అనే రౌడీ షీటర్ కథ ఇది. మహాభారతంలో కనికుడి పాత్రలాంటిది.
ధతరాష్ట్రుడి పక్కనే ఉండే కనికుడు దుర్మార్గుడు. అతని నీతి ఏంటంటే నేనే గొప్ప, ఎదురొచ్చినవాడిని సమయం చూసి దెబ్బకొట్టాలి అనేది. ఇదే కనికనీతి. అడ్డొచ్చినవాడు కొడుకైనా కనికుడు ప్రతీకారం తీర్చుకోకుండా వదిలేవాడు కాదు. దీని గురించి ఇప్పటిదాకా మన మూవీస్‌లో ఎవరూ చెప్పలేదు. కొత్తగా ఉంటుందని ఈ సినిమాలో పెట్టాను.
మా మూవీకి ప్రధాన ఆకర్షణగా రఘు కుంచె మ్యూజిక్ నిలుస్తుంది. ఆయన ఈ సినిమాకు మంచి బీజీఎం చేశారు. సినిమా చూసిన వారంతా బీజీఎం, పాటల గురించి ప్రశంసిస్తున్నారు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సాగే మర్డర్ మిస్టరీ స్టోరీ ఇది. వర్తమానంలో, గతంలో జరిగినవి చూపిస్తూ మర్డర్ మిస్టరీ కథను ఆసక్తికరంగా తెరకెక్కించాను.
ఇందులో రెండు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ కూడా చూపిస్తున్నాం. మొత్తం ఐదు కథలు గేదెలరాజు చుట్టూ జరుగుతుంటాయి. చూస్తే ఒకటే నిజం, చూడక పోతే వంద అనుమానాలు అనే క్యాప్షన్ కూడా మా మూవీకి పర్పెక్ట్ గా పెట్టాం. మా సినిమా చూసిన ఎవరూ కూడా కథలోని ట్విస్ట్ ను కనిపెట్టలేకపోయారు.
థ్రిల్ చేసే మర్డర్ మిస్టరీ
- Advertisement -
- Advertisement -



