Saturday, September 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డాక్టర్ చింతకింది మురహరికి ఘన సన్మానం

డాక్టర్ చింతకింది మురహరికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు, ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వైద్య రంగంలో అత్యుత్తమ సేవలందించిన డాక్టర్ చింతకింది మురహరిని ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతకింది మురహరి మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని, పద్మశాలి సంఘం ప్రతినిధులకు, సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైద్య రంగంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు పాషికంటి శ్రీనివాసు, చిక్క శ్రావణ్ కుమార్, బేతి రాములు, చింతకింది రామానుజం, ఆడేపు బాలస్వామి, గుజ్జ అశోక్, బడుగు జహంగీర్, సోమ రుషి, బింగి నరసింహులు, భోగ సంతోష్, వెంకటేష్ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -