Saturday, September 12, 2026
E-PAPER
Homeజిల్లాలుకరెంటు కోసం ఎడ్లబండితో రైతుల ఆందోళన

కరెంటు కోసం ఎడ్లబండితో రైతుల ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
“మార్పు కావాలని ఓట్లేస్తే.. రేవంత్‌ ప్రభుత్వం రైతును మళ్లీ కరెంటు కోసం రోడ్డెక్కించే మార్పు తెచ్చిందని” బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆరోపించారు. శనివారం పంటలు ఎండుతున్న సందర్బంగా రైతులు తుక్కాపూర్‌లోని విద్యుత్‌ ఏఈ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఎడ్లబండితో రోడ్డుపై ఆందోళన, రాస్తా రోకో నిర్వహించారు. “మోటార్లకు కరెంటు లేదు.. పొలాల్లో నీళ్లు లేవు.. పంటలు ఎండిపోతున్నాయని, రైతు పంటను కాపాడటంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం పసుపు నీళ్లపై విచారణ చేయడం దౌర్భాగ్యం” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 

వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వక పోవడంతో ఈ ప్రభుత్వంపై ఒక అనుమానం వస్తుందని, సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణా రెడ్డి విమర్శించారు. విద్యుత్ ను ఇప్పటి నుండే తగ్గిస్తే పంటలు సరిగ్గా పండకుంట ఉంటుందని తెలిపారు. రైతులు ఎక్కువగా ధాన్యం పండిస్తే కొనడానికి ప్రభుత్వాని ఇబ్బందులు ఎదురావుతాయన్న ఉద్దేశంతో కరంట్ సరిగా ఇవ్వడం లేదని అర్థం అవుతుందన్నారు.

“మార్పు తెచ్చామని చెప్పుకుంటున్న రేవంత్‌ ప్రభుత్వం.. రైతుకు మాత్రం రోజుకు 9 – 10 గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోతోందని, నాడు 24 గంటల కరెంటు ఇచ్చిన తెలంగాణలో నేడు కరెంటు కోసం ఎడ్లబండితో రోడ్డెక్కే పరిస్థితి రావడమేనా ఈ మార్పు?” అని ప్రశ్నించారు. విద్యుత్‌ సరఫరాపై రైతులు ఏఈ శ్రీధర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు అత్యవసరమైన సమయంలో కోతలు విధించడం వల్ల తీవ్ర నష్టం వాటి ల్లుతోందని పేర్కొన్నారు. కనీసం 20 గంటలపాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేసి పంటలను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ ఏఈ శ్రీధర్‌కు వినతిపత్రం సమర్పించారు.

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యుత్‌ సరఫరాను మెరుగుపరచాలని, లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తా మని బీఆర్‌ఎస్‌ నాయకులు హెచ్చరించారు. ఆందోళనలో సర్పంచ్ లు బక్క కనకయ్య, కోల వెంకటస్వామి, పార్టీ నాయకులు చిలువేరి మల్లా రెడ్డి, బోధనం కనకయ్య, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, వేల్పుల స్వామి, చంద స్వామి, సుతారి రమేష్, పరమేశ్వర్ రెడ్డి, మంగ నర్సింలు, ఎల్లం, నరేందర్ గౌడ్, బోయిని శ్రీనివాస్, నేవూరి కర్ణాకర్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -