నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలోని ఎస్సార్ జూనియర్ కళాశాల విద్యార్థి బైరి చండీశ్వర్ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి అండర్-17 జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కబడ్డీ, వాలీబాల్ విభాగాల్లో జిల్లా స్థాయికి ఎంపిక కావడంతో పాటు, 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం, 200 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి కళాశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారు.
చండీశ్వర్ సాధించిన విజయాల పట్ల కళాశాల ప్రిన్సిపాల్ నాళం అయ్యప్ప, వైస్ ప్రిన్సిపాల్ రాజు హర్షం వ్యక్తం చేసి, విద్యార్థిని అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పరుశరాములు, లావణ్య, మధుసూదన్, వీరచారి, కమలాకర్, సునంద, కృష్ణ, ఉప్పచారి, రమేష్, ఇందిరా, లావణ్య ,నమీర జాస్మిన్, ఆంజనేయులు, సింధు, నర్మద తదితరులు పాల్గొని బైరి చండీశ్వర్‌ను అభినందించారు.



