నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి నలంద పాఠశాలలో బుధవారం గ్రాడ్యుయేషన్ అకాడమిక్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ సెరిమని ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీనటి “కితకితలు” సినిమా ఫేమ్ గీతా సింగ్ , పాఠశాల యజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం(2026-27) క్యాలెండర్ ను గీత సింగ్ , ఉపాధ్యాయుల సమక్షంలో ఆవిష్కరించారు. పాఠశాలలో నిర్వహించే వివిధ విద్యస్థాయి నైపుణ్యాలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు, విద్యార్థుల యొక్క ప్రతి టాలెంట్‌ను గుర్తించి వారికి సర్టిఫికెట్లు, ప్రశంస పత్రాలను, మెడల్స్ ను బహుకరించారు.
ఈ విద్యా సంవత్సరం ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలతో పాటు సర్టిఫికెట్స్ అందజేసినారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతను , విద్యార్థులు ఆయా రంగాలలో సాధించిన విజయాలను కొనియాడారు. విద్యార్థుల యొక్క కృషికి అహర్నిశలు కష్టపడినా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వచ్చే సంవత్సరం నలంద స్కూల్లో అబాకస్, ఐఐటి, ఒలంపియాడ్ చేతివ్రత మెరుగుపరుచుటకు లూసిదా, ఇంకా మెరుగైన విద్య కొరకు కొత్త సంవత్సరానికి కొత్త ఆలోచనతో తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన గీత సింగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తో పాటు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



